Ram Charan: వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్…!

చిరంజీవికి అతని కుటుంబం అంటే ఎంత అపేక్ష అనే విషయం అందరికీ తెలుసు. ప్రతి పండుగ కుటుంబ సమేతంగా జరుపుకోవడానికి ఇష్టపడే చిరంజీవి.. బర్త్డే సందర్భంగా అతని కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్టును తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.చిరంజీవి కూతురు కొణిదెల క్లింకరా తో ఉన్న ఒక పిక్ ను షేర్ చేసిన రామ్ చరణ్..

హ్యాపీ వెస్ట్ బర్త్ డే టూ చిరుత చిరంజీవి తాత.. మా ఇంట్లో లిటిల్ మెంబర్ నుంచి చిరంజీవికి ప్రేమతో శుభాకాంక్షలు అన్న క్యాప్షన్ ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాకుండా చిరంజీవి తన మనవరాలతో ఉన్న పిక్ బయటకు రావడం ఇది మొదటిసారి కావడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫాన్స్ భారీ ఎత్తున సెలెబ్రేట్ చేయడంతో పాటు సోషల్ మీడియాని పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

ఫాన్స్ తో పాటు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. (Ram Charan) రామ్ చరణ్ తో పాటు మెగా హీరోలు అందరూ వరుస పెట్టి చిరంజీవితో తమకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ పలు రకాల బర్త్డే పోస్ట్ లు పెట్టారు. వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి బూస్ట్ అందుకున్న చిరంజీవి భోళాశంకర్ తో కాస్త బోల్తా పడ్డాడు…అయితే ఇంకా అతని లైన్ అప్ లో మరిన్ని కొత్త సినిమాలు ఉన్నాయి.

ఈసారి తీయబోయే చిత్రం కచ్చితంగా వాల్తేరు వీరయ్యను మించిన సక్సెస్ అవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి విషెస్ పెట్టడంతో పాటు అతని శ్రమ, పట్టుదల ఎందరికో ఆదర్శమని పొగుడుతున్నారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినీ ప్రస్థానం అందరికోసం స్ఫూర్తిదాయకం.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus