ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోపక్క తన తండ్రి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నాడు రాంచరణ్. తనని ఆకట్టుకునే పరభాషా చిత్రాల రైట్స్ ను కూడా ముందుగానే కొనుక్కుని రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘లూసిఫర్’ ‘డ్రైవింగ్ లైసెన్స్’ వంటి మలయాళం సూపర్ హిట్ సినిమాల రైట్స్ ను కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. మరోపక్క ‘ఆర్.ఆర్’ఆర్’ అలాగే ‘ఆచార్య’ సినిమాల షూటింగ్ లలో జాయిన్ అవ్వడానికి కూడా రెడీ అవుతున్నాడు.
వీటితో పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత నటించబోయే తరువాతి సినిమాకి సంబంధించిన కథల్ని కూడా వింటున్నాడట. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు వెబ్ సిరీస్ ల వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు సినిమాలను మించి వెబ్ సిరీస్ లు ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. లాక్ డౌన్ కారణంగా అవి కూడా ఊపందుకున్నాయి. అందుకే మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను నిర్మించడానికి చరణ్ కూడా రెడీ అవుతున్నాడట.
ఇప్పటికే కథల అన్వేషణలో ఉన్నాడని.. పలువురు సినీ పెద్దలను అలాగే..తండ్రి చిరంజీవి, సతీమణి ఉపాసన ల సలహాలు తీసుకునే.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తాను నిర్మించే వెబ్ సిరీస్ లను తన మావయ్య ‘ఆహా’ ప్లాట్ ఫామ్ కోసమే చేస్తాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!