Ram Charan: మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ అయిన ‘బింబిసార’ దర్శకుడు.. ఏమైందంటే..!

మల్లిడి వశిష్ట్ .. ‘బింబిసార’ చిత్రానికి ముందు వరకు ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ ‘బింబిసార’ రిలీజ్ అయ్యాక ఈ పేరు మార్మోగిపోయింది. ఆగష్ట్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ అయితే రాలేదు. జస్ట్ యావరేజ్ రివ్యూలు మాత్రమే వచ్చాయి. కానీ టీజర్, ట్రైలర్ లతో నెలకొన్న హైప్ కారణంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మెయిన్ రోల్ పోషిస్తుంది కాబట్టి.. ఈ ఒక్క చిత్రంతో మల్లిడి వశిష్ట్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. రజినీకాంత్ కు కూడా వశిష్ట్ కథ వినిపించుకుని సినిమా ఓకే చేయించుకునే రేంజ్ కు వెళ్ళాడు. వశిష్ట్ నాన్నగారు మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు అల్లు అర్జున్- వినాయక్ కాంబినేషన్లో ‘బన్నీ’ అనే సూపర్ హిట్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే.

వశిష్ట్ కూడా గతంలో హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ అనే చిత్రంలో హీరోగా కూడా నటించాడు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇతను మెగా అభిమానులకు.. ముఖ్యంగా రాంచరణ్ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఎందుకంటే.. గతంలో రాంచరణ్ లుక్స్ పై ట్రోలింగ్ జరిగేది అన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చేసిన ఓ మీమ్ కు వశిష్ట్ లైక్ కొట్టాడట. దీంతో చరణ్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది.

అంతే ట్విట్టర్లో #BanVassishtaFromTFI అనే హ్యాష్ ట్యాగ్ తో వశిష్ట్ ను ట్రోల్ చేస్తున్నారు రాంచరణ్ ఫ్యాన్స్. ఈ విషయాన్ని తొందరగానే గమనించిన వశిష్ట్ ఆ పోస్ట్ ను అన్ లైక్ చేశాడు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసి మరీ ఈ యంగ్ డైరెక్టర్ ను ఆడేసుకుంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus