Game Changer: గేమ్ ఛేంజర్ టైటిల్ గురించి చరణ్ ఫ్యాన్స్ అలా అన్నారా?

చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ (Game Changer) అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఊహించని టైటిల్ ను ఫిక్స్ చేయడంతో అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సీఈవో అనే టైటిల్ ఫిక్స్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గేమ్ ఛేంజర్ టైటిల్ బాగానే ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం సీఈవో టైటిల్ బాగుందని చెబుతున్నారు.

అయితే శంకర్ మాత్రం కథ పరంగా గేమ్ ఛేంజర్ టైటిల్ బాగుంటుందని భావించారని తెలుస్తోంది. దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది. చరణ్ కెరీర్ లో ఈ మూవీ మరింత స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. చరణ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇదే కాగా ఈ సినిమాతో ఈ కాంబో నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తండ్రీకొడుకులుగా చరణ్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. చరణ్ శంకర్ కాంబోలో ఇదే తొలి సినిమా కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రామ్ చరణ్ సైతం భిన్నమైన పాత్రలకు ఓటేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. రామ్ చరణ్ ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలుగా ఉండగా చిరంజీవి, చరణ్ రాబోయే రోజుల్లో సైతం కలిసి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా సినిమాకు చరణ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus