Ram Charan, Kalyan Ram: ఆ రామ్ కోసం అనుకున్న టైటిల్ ఈ రామ్ వద్దకు వచ్చిందట..!

  • June 27, 2024 / 01:12 PM IST

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమా. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ఆమె పోలీస్ పాత్ర పోషిస్తుంది.ఫైట్స్ సీక్వెన్స్ లో కూడా పాల్గొన్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, అశోక క్రియేష‌న్స్ సంస్థ‌లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అయితే ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మొన్న రిలీజ్ చేసిన విజయశాంతి (Vijayashanti)  గ్లింప్స్ లో టైటిల్ ను రివీల్ చేయలేదు. మొత్తానికి ఇప్పుడు టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘మెరుపు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అయినట్టే..! గతంలో రాంచరణ్ (Ram Charan) సినిమా కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేశారు.

‘బంగారం’ ఫేమ్ ధరణి ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలి. కాజల్ (Kajal Aggarwal) హీరోయిన్, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. చాలా గ్రాండ్ గా ఆ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ‘మెరుపు’ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా టైటిల్ పై కూడా ఎవ్వరూ ఫోకస్ చేయలేదు. చివరికి అది కళ్యాణ్ రామ్ కోసమే రాసి పెట్టినట్టు ఉంది. తిరిగి తిరిగి అతని వద్దకే వచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus