Ram Charan, Dilraju: ఆ విషయంలో చరణ్ గ్రేట్ అంటున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి ఈ నెల 9వ తేదీన ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలిసి దిల్ రాజు శోకసంద్రంలో మునిగిపోయారు. దిల్ రాజును ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శ్యామ్ సుందర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేయడంతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ లు పెట్టారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను డైరెక్ట్ గా కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్ గొప్పోడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కష్టాల్లో ఉన్నవాళ్లకు తగినంత ఓదార్పు అవసరం కాగా దిల్ రాజు ఇంటికి చేరుకున్న చరణ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుండగా చరణ్ సినీ కెరీర్ లో దాదాపుగా మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం. రామ్ చరణ్ కెరీర్ లోని విలువైన సమయం వృథా అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమాలకు టాలీవుడ్ స్టార్స్ దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ (Ram Charan) సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా చరణ్ కు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో రామ్ చరణ్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus