Ram Charan: కోట్లు ఖర్చు చేసి మరి గుర్రం కొన్న రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఈయన తదుపరి సినిమాని చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలకు ఈయన కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనే విషయం మనకు తెలిసిందే.

దీంతో ఆయన ప్రత్యేకంగా కొన్ని గుర్రాలను కూడా కొనుగోలు చేశారు. ఇప్పటికే తన వద్ద రెండు గుర్రాలు ఉండగా తాజాగా మరొక గుర్రం కూడా కొనుగోలు చేశారని ఈయన సోషల్ మీడియా వేదికగా గుర్రంతో కలిసి దిగినటువంటి అభిమానులతో పంచుకున్నారు. ఇలా తన గుర్రంతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ దాని పేరు బ్లేజ్ అని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారింది. తాజాగా ఈ గుర్రం గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఈ గుర్రం ఖరీదు ఎంత ఏంటి అనే విషయాల గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈయన కొనుగోలు చేసిన ఈ గుర్రం ఖరీదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఒక గుర్రం కోసం (Ram Charan) రామ్ చరణ్ ఈ స్థాయిలో ఖర్చు చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. గుర్రం కోసం రామ్ చరణ్ ఖర్చు చేసిన డబ్బుతో ఒక విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయొచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక గుర్రం విలువ నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus