Ram Charan: రామ్ చరణ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. భలే ఉన్నారంటూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ ఈ ఏడాదే రిలీజవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజవుతుందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చినా ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. శంకర్ ఒకే సమయంలో రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రామ్ చరణ్ తాజాగా మరో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు.

హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ రామ్ చరణ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. చరణ్ ఫోటోలను చూసి ఏమున్నాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరికొత్త హెయిర్ స్టైల్స్, సరికొత్త లుక్స్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రామ్ చరణ్ లుక్ సూపర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా సినిమాకు చరణ్ రేంజ్ పెరుగుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ 17వ సినిమా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. చరణ్ సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవ్వాలని అభిమానులు ఫీలవుతున్నారు. చరణ్ వరుసగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలకు బిజినెస్ సైతం వేరే లెవెల్ లో జరుగుతోందని తెలుస్తోంది.

రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. చాలామంది స్టార్ నిర్మాతలు చరణ్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఊహించని స్థాయిలో సత్తా చాటుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus