స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి సినిమా చేయాలని రామ్‌చరణ్ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితం ‘మెరుపు’ అనే సినిమా స్టార్ట్ అయ్యి… ఆగిపోయింది. ఆ తర్వాత రామ్‌చరణ్ ఎప్పుడూ అలాంటి కథలను ఎంచుకోలేదు. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే గౌతమ్ తిన్ననూరి సినిమాతో చరణ్ కల నెరవేరుతుంది అని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తీరా చూస్తే… ఇప్పుడు మనసు మారింది అంటున్నారు. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ తిన్ననూరి.
ఇప్పడుఉ ‘జెర్సీ’ హిందీ రీమేక్ చేశారు. త్వరలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా ఉంటుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మేలో సినిమా ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎలాంటి మార్పులు లేకపోతే మేలో సినిమాకు కొబ్బరికాయ కొట్టి, జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట. అయితే షూటింగ్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది. ఇక అసలు విషయానికొస్తే… ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో ఉంటుందని ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి చెప్పారు.
రామ్‌చరణ్‌ను సరికొత్తగా చూపిస్తామని అని అన్నారు. మరోవైపు గౌతమ్… రీసెంట్ హిట్ క్రికెట్ నేపథ్య చిత్రం కావడం, ఇప్పుడు చరణ్‌కు చెప్పిన కథ కూడా క్రీడా నేపథ్యం అని తెలియడంతో… చరణ్ కొత్త సినిమాలో స్పోర్ట్స్ ప్లేయర్‌గా కనిపించడం పక్కా అని అనుకున్నారు. కానీ అదేం కాదు.. ఈసారి గౌతమ్ పక్కా మాస్ కథతో వస్తున్నారట. గత రెండు చిత్రాలకు భిన్నంగా, పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో గౌతమ్ తిన్ననూరి ఈ స్క్రిప్టుని తయారు చేశారని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ పక్కా అని… బలంగా వార్తలొచ్చినా ఇప్పుడు మాస్ కథ అంటుండంతో మనసు మారిందా? లేక ముందు నుండీ ఇదే అనుకున్నారా? అనే చర్చ మొదలైంది.
అయితే గతంలో ‘రంగస్థలం’ సమయంలో కూడా ఇలానే ప్రయోగాత్మక చిత్రం కాదని లీకులు ఇచ్చి, ఆ తర్వాత రామ్‌చరణ్ ప్రయోగమే చేసిన విషయం మరచిపోకూడదు. శంకర్ – దిల్ రాజు సినిమాకు రామ్‌చరణ్ కాస్త గ్యాప్ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారం కోసం ఆ సినిమాకు పాజ్ ఇచ్చాడు. ‘ఆర్‌ఆర్ఆర్’ విడుదలైపోవడంతో… ఇక శంకర్ సినిమాపై దృష్టిపెడతాడట. ఆ సినిమా అయిన వెంటనే గౌతమ్ సినిమా ఫుల్ స్వింగ్‌లో పూర్తి చేస్తారని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి శంకర్ సినిమా వస్తుందంటున్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?