మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సంధర్భంగా.. విడుదల చేసిన ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇది చిరు కి 152 వ చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఇక 153 వ చిత్రంగా ‘లూసీఫర్’ రీమేక్ చెయ్యాలని చిరు భావించారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కావడం లేదు. అందుకే ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని టాక్ నడుస్తుంది.
అంతేకాదు మెహర్ రమేష్ డైరెక్షన్లో చెయ్యాల్సిన ‘వేదాలం’ రీమేక్ స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తి కానీ పక్షంలో బాబీ డైరెక్షన్లోనే తన 153 వ చిత్రాన్ని చెయ్యాలని చిరు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాల్సి ఉంది. అయితే ‘కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై చరణ్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యే అవకాశం ఉందట. అందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలైనట్టు వినికిడి.
చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత .. మొదటి రెండు సినిమాలని చరణ్ నిర్మిస్తూ వచ్చాడు. ‘ఆచార్య’ చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడం పై నిర్మాతలు సంతృప్తి కారణంగా లేనట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!