మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అదే ‘రౌద్రం రణం రుథిరం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నాడు చరణ్. నిజానికి ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చెయ్యాలి అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సంభవించడంతో.. ‘ఆర్.ఆర్.ఆర్’.. జనవరికి రావడం కష్టమే అని నిర్మాత దానయ్య కూడా తెలిపాడు. అందులోనూ షూటింగ్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉంది.
మరోపక్క ఈ చిత్రంలో చరణ్ షూటింగ్ పార్ట్.. పూర్తయితే .. మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొనేలా ఆ టీం ప్లాన్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చరణ్.. ‘ఆచార్య’ లో నటించే అవకాశం లేదు. ఒక్కసారి షూటింగ్ లు ప్రారంభం అయిన వెంటనే చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ‘ఆచార్య’ లో చరణ్ నటించే అవకాశం లేదు. కాబట్టి ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివ.. చిరుతో కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.
ఈ చిత్రంలో చరణ్ పాత్ర 30 నిమిషాల వరకూ ఉంటుందని కొరటాల ఎప్పుడో చెప్పాడు.కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 30 నిమిషాల నిడివిని 15 నిముషాలు చేసేయ్యాలని చిరు, కొరటాల డిసైడ్ అయ్యారట. అంతేకాదు చరణ్ చెయ్యాల్సిన పాత్రను కూడా చిరునే చేసేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!