ఇది జరిగితే మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్టే ..!

ఇప్పటికే మహేష్ బాబు వరుసగా మూడు హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక తరువాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడు. 2021 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కాబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లెండి. అయితే ఈ చిత్రం పూర్తయ్యేలోపు మహేష్ రెండు చిత్రాల్లో కనిపించి సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నదని ఫిలింనగర్ అంతా కోడై కూస్తుంది. ఇప్పటికే ‘ఎఫ్2’ సీక్వెల్ గా రూపొందుతోన్న ‘ఎఫ్3’ సీక్వెల్ లో నటించడానికి మహేష్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లో కూడా మహేష్ గెస్ట్ రోల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 25శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ పాత్ర 45నిమిషాల వరకూ ఉంటుందట. అయితే చరణ్ ఉన్నాడు కాబట్టి ఈ చిత్రాన్ని 2021 సమ్మర్లో విడుదల చేసుకోండి అని రాజమౌళి గట్టిగా చెప్పాడట. ఎలాగూ 2021 సంక్రాంతికి అంటే జనవరి 8కి ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైపోతుంది కాబట్టి.. ప్రాబ్లెమ్ లేదని రాజమౌళి చెప్పాడట. అయితే చిరు మాత్రం ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చెయ్యాలి అని దర్శకుడు కొరటాల గట్టిగా చెప్పారట. దీంతో మహేష్ ను రెఫెర్ చేసాడట కొరటాల. ప్రస్తుతం చిరు, కొరటాల మహేష్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మహేష్ ఓకే చెబితే ఆయన అభిమానులకి.. డబుల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus