Ram Charan: బులెట్‌ లాంటి ప్రశ్నలు.. మిస్సైల్‌ లాంటి ఆన్సర్లు… భలే కాంబో అబ్బా!

మనం ఇన్నాళ్లూ చూస్తున్న రామ్‌చరణ్‌ వేరు, అన్‌స్టాపబుల్‌ షోలో చూసిన రామ్‌చరణ్‌ వేరు. నిన్న రాత్రి నుండి సోషల్‌ మీడియాలో ఇదే చర్చ. ఎందుకంటే తండ్రి చాటు బిడ్డగా ఇన్నాళ్లూ కామ్‌గా కనిపించిన రామ్‌చరణ్‌లో ఇంతటి కామెడీ టైమింగ్‌ ఉందా? ఇంత యాక్టివ్‌గా ఉంటాడా అనేలా మాట్లాడాడు. దీంతో ఫ్యాన్స్‌ కాస్త షాక్‌ అయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలో ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో చరణ్‌ ఆన్సర్లు మిస్సైల్‌లా వినిపించాయి.

Ram Charan

అన్‌స్టాపబుల్‌ షోలో బాలాగిరి అనే ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌ ఒకటి ఉంటుంది. అందులో బాలకృష్ణ అడిగిన తుంటరి ప్రశ్నలకు చరణ్‌ చక్కని సమాధానాలు ఇచ్చి మెప్పించాడు. ఈ సినిమా నేను చేస్తే బాగుండేది అని ఏ సినిమా విషయంలో అనిపించింది అని బాలయ్య అడిగితే.. కాస్త ఆలోచించి ‘ఆదిత్య 369’ అని చెప్పి బాలయ్యను ఇరికించాడు. ఈ సినిమా ఎందుకు చేశాను అని ఏ సినిమా విషయంలో అనుకున్నావ్‌ అని అడిగితే.. ‘జంజీర్‌’ అంటూ ‘తుఫాన్‌’ (తెలుగులో) గురించి చెప్పాడు. ఆ సినిమా ఎందుకు చేశానో నాకే తెలియదు అని కూడా అన్నాడు.

‘రంగస్థలం’, ‘మగధీర’ సినిమాల్లో ఏది గొప్ప సినిమా అనుకుంటున్నావు అని అడిగితే.. ‘మగధీర’ చేశాను కాబట్టే ‘రంగస్థలం’ అవకాశం వచ్చిందేమో. కాబట్టి ‘మగధీర’నే అని చెప్పాడు. మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి వస్తే మహేష్‌ బాబు, ప్రభాస్‌లో ఏ హీరోతో కంఫర్ట్‌ అని ఇరుకునపెట్టే ప్రశ్న వేస్తే.. సీనియారిటీ పరంగా మహేశ్‌తో చేస్తా. అయినా ప్రభాస్‌కి నో చెబితే ఏమీ అనుకోడు అని తమ స్నేహాన్ని గుర్తు చేశాడు.

సమంత, అలియా భట్‌, కియారా అడ్వాణీలో ఎవరు బెస్ట్‌ అనుకుంటున్నావు అని అడిగితే.. ఠక్కున సమంత పేరే చెప్పాడు రామ్‌చరణ్‌. మరి పవన్‌ కల్యాణ్‌ నటుడిగా బెటరా? రాజకీయ నాయకుడిగా బెటరా? అని అడిగితే.. ముందు రెండూ అని చెప్పినా.. ఒక్కటే చెప్పాలి అనేసరికి పొలిటిషియన్‌ అని తేల్చేశాడు చరణ్‌. అక్క సుస్మిత, చెల్లి శ్రీజలో ఎవరు అంటే ఇష్టం అని అడిగితే.. అక్కతో డేంజర్‌. మా తాతలాగే ఉంటుంది. కాబట్టి సుస్మిత అక్క అని అన్నాడు. నీ భార్య ఉపాసన అంటే భయమా? అని బాలకృష్ణ స్ట్రెస్‌ చేసి అడిగితే.. ముందు కాదని చెప్పిన చరణ్.. ఆ తర్వాత భయం లేదుగానీ ఉన్నట్టు నటిస్తా అని అన్నాడు.

 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus