చరణ్ రేంజ్ స్క్రిప్ట్ శర్వా చేస్తున్నాడట..!

హీరో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూట్ కి సిద్ధం అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా లాక్ డౌన్ కారణంగా పుణె లో మొదలు కావాల్సిన ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ కి బ్రేక్ పడింది. కరోనా నిబంధనల నేపథ్యంలో హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో ఈ మూవీ చిత్రీకరణ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణా గవర్నమెంట్ అనుమతులు ఇవ్వగా మరో వారం పది రోజులలో ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ మొదలు కానుంది.

దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితం అవుతున్న చరణ్ అనేక మంది దర్శకుల నుండి కథలు విన్నట్లు సమాచారం. వారిలో ఓ యంగ్ డెబ్యూ డైరెక్టర్ కూడా ఉన్నాడట. ఆ యంగ్ డైరెక్టర్ కథకి చరణ్ ఇంప్రెస్ అయినప్పటికీ తాను చేయను అన్నారట. అలాగే ఆయన హీరో శర్వా నంద్ కి ఈ సబ్జెక్టు బాగా సెట్ అవుతుంది.. అతనితో ట్రై చేయమని సలహా కూడా ఇచ్చారట. దీనితో సదరు డైరెక్టర్ శర్వాకు కథ వినిపిస్తే ఒకే చేశారట.

అలా చరణ్ దగ్గరకు వెళ్లిన స్క్రిప్ట్ శర్వాకు ఓకె అయ్యిందని సమాచారం. ఇక శర్వా ప్రస్తుతం శ్రీకారం అనే మూవీలో నటించగా ఆ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతితో శర్వా నంద్ మహా సముద్రం లో నటిస్తున్నారు. ఆ తదుపరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus