మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా మారి తీసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పక్కన స్వీటీ అనుష్కను చరణ్ ప్రయత్నించారు. కానీ అప్పుడు అనుష్క బాహుబలి చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోయింది. అయినా చిరు, అనుష్క జంటను వెండితెరపైన చూడాలనే కోరిక మాత్రం చరణ్ కి తగ్గలేదు. అందుకే ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాలో ఎలాగైనా అనుష్కను నటింపజేయించాలని రామ్ చరణ్ అనుకుంటున్నారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి స్టోరీని స్వీటీ కి వివరించారు. కథ ఆమెకు నచ్చినా.. సైన్ చేయడంపై ఆలోచిస్తుందంట.
ఎక్కువ రోజులు షూటింగ్ జరుగవచ్చని వెనుకడుగు వేస్తోంది. షూటింగ్ లేట్ అయితే తన పెళ్లి కూడా పోస్ట్ పోన్ అవుతుందని మెగా ఆఫర్ కి ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్నీ తెలుసుకున్న రామ్ చరణ్ ఆమెకు నమ్మకం కలిగించి, ప్రాజక్ట్ ఒకే చేయించేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్లు ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. మరి అనుష్క చిరంజీవి పక్కన నటించడానికి ఒకే చెబుతుందా? లేదా? కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.