రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ శంకర్‌తో (Shankar) వర్క్ చేయడం గురించి తన ఎక్స్‌సైట్‌మెంట్‌ని షేర్ చేసుకున్నాడు. శంకర్‌తో తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్పాడు. విషయం ఏమిటంటే, ‘3 ఇడియట్స్’ రీమేక్ ‘నన్బన్’ (Nanban) తెలుగు రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, శంకర్‌ని ఫస్ట్ టైమ్ కలిశాడట. ఆ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రామ్ చరణ్, శంకర్ పక్కనే కూర్చున్నాడు.
అప్పుడే శంకర్‌ని ఒక తెలుగు సినిమా డైరెక్ట్ చేయమని అడిగాడట. కానీ, తనతో సినిమా తీయమని మాత్రం అడగలేదట! ఎందుకంటే, “అప్పట్లో శంకర్ గారి సినిమాలో నటించేంత కాన్ఫిడెన్స్ నాకు లేదు” అని రామ్ చరణ్ ఓపెన్‌గా చెప్పాడు.చాలా ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ అయింది. ‘RRR’ (RRR Movie) లాస్ట్ షెడ్యూల్స్‌లో ఉండగా, శంకర్ నుంచి రామ్ చరణ్‌కి ఒక సర్‌ప్రైజ్ కాల్ వచ్చింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) ఈ విషయం చెప్పగానే, రామ్ చరణ్ వెంటనే శంకర్‌కి కాల్ బ్యాక్ చేయమన్నాడట.
ఆ మూమెంట్ తన లైఫ్‌లో ‘డ్రీమ్ కమ్ ట్రూ’ మూమెంట్ అని రామ్ చరణ్ ఫీల్ అయ్యాడు. శంకర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతూ, “ఆయన కమర్షియల్ సినిమాకి ఐకాన్. పాన్-ఇండియా సినిమాలకి ఆయనే ఫౌండర్. పాన్-ఇండియా సినిమా అంటే ఏంటో ఆయనే డిఫైన్ చేశారు. మనకి ఉన్న ఫస్ట్ పాన్-ఇండియా డైరెక్టర్ ఆయనే. నేను నిజంగా బ్లెస్డ్” అని ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్. రాజమౌళి (S. S. Rajamouli , శంకర్ లాంటి ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడం తన అదృష్టమని రామ్ చరణ్ అన్నాడు.
ఇద్దరూ డిఫరెంట్ స్టైల్స్‌లో సినిమాలు తీస్తారని, వాళ్ళిద్దరితో వర్క్ చేయడం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు.ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే, రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వానీ హీరోయిన్‌గా (Kiara Advani) నటిస్తోంది. SJ సూర్య (SJ Suryah), అంజలి (Anjali), సముద్రఖని (Samuthirakani) , జయరామ్ (Jayaram) , సునీల్(Sunil), శ్రీకాంత్ (Srikanth) వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అందించగా, తమన్ (S.S.Thaman) మ్యూజిక్ డైరెక్టర్. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.