Ram Charan: ఆ విషయంలో రామ్ చరణ్ కు ధైర్యం చెప్పిన నాగార్జున.. ఏం జరిగిందంటే..!

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చార తొలిసినిమా తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని, నేడు తండ్రినే మించిన తనయుడిగా ఎదిగాడు. సినిమా సినిమాకి తనలోని విలక్షణతని చూపిస్తూ, నటన పరంగా ఎంతో పరిణీతి చూపించి రంగస్థలం చిత్రం తో తనని ద్వేషించే వాళ్ళ చేత కూడా శబాష్ అనిపించుకున్న నటుడు రామ్ చరణ్. ఇక గత ఏడాది విడుదలకైనా ఆర్.ఆర్.ఆర్ చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని సాధించి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు.

ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సునామి ని సృష్టించబోతున్నాడో చూడాలి . అలాగే బాలీవుడ్ , హాలీవుడ్ లలో కూడా రామ్ చరణ్ ప్రత్యేకంగా త్వరలో సినిమాలు చెయ్యబోతున్నాడు, ఇలా రాబోయే రోజులు మొత్తం నావే అనే రీతిలో రామ్ చరణ్ సినీ ప్రయాణం కొనసాగనుంది.

ఇప్పుడు ఈ స్థాయిని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, తన తొలి చిత్రం చిరుత విడుదల సమయం లో చాలా టెన్షన్ పడ్డాడు అట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకు, ఆయన కొడుకు అంటే నటన , డ్యాన్స్ , ఫైట్స్ ఇలా ప్రతీ దాంట్లో కూడా అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ పెట్టుకుంటారు. ఆ అంచనాలను రీచ్ అవ్వగలనా లేదా అని భయపడుతూ ఉన్నాడట. రామ్ చరణ్ కి నాగార్జున బాగా దగ్గరైన వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే.

‘చిరుత’ సినిమా విడుదలకు ముందు రోజు రామ్ చరణ్ నాగార్జున ఇంటికి వెళ్లి కూర్చున్నాడట. ఏమి భయపడొద్దు, నేను ప్రివ్యూ షో చూసాను, అదరగొట్టేసాను, ప్రశాంతం గా ఉండు, అభిమానులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది అని ధైర్యం చెప్పాడట. ఆరోజు రాత్రి మొత్తం రామ్ చరణ్ నాగార్జున గారి ఇంట్లోనే ఉన్నాడట, ఈ విషయం స్వయంగా నాగార్జున గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus