ఘాడంగా ప్రేమించుకుంటున్న రామ్ చరణ్, సమంత
- August 30, 2017 / 10:04 AM ISTByFilmy Focus
ఈ టైటిల్ చదవగానే మీకు అర్ధమైపోయి ఉంటుంది.. రామ్ చరణ్, సమంత ప్రేమ రియల్ కాదు.. రీల్ లైఫ్ లోనిదని. మీ అంచనా కరక్ట్. వారిద్దరూ కలిసి మొదటి సారి రంగస్థలం 1985 లో నటిస్తున్నారు. ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వేగంగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది. సుకుమార్ దర్శకుడు చిత్ర ప్రమోషన్లో బిజీ కావడం, చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా నర్సింహారెడ్డిని సెట్స్ పైకి తీసుకెళ్లే పనుల్లో పడడంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ షురూ అయింది.
హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో 5 కోట్లతో నిర్మితమైన భారీ సెట్ లో చెర్రీ, సమంతలపై కొని ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాత్రి వేళ నదీ ఒడ్డున కూర్చొని మాట్లాడుకునే సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాతికేళ్ళనాటి ప్రేమ కథను పరిచయం చేయనున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? రాదా? అనేది సస్పెన్స్ గా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















