Ram Charan: రామ్ చరణ్ భన్సాలీ మూవీ స్టోరీ లైన్ ఇదేనా?

  • February 10, 2024 / 03:08 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చరణ్ లుక్ సైతం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాలతో పాటు రామ్ చరణ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని భోగట్టా. చరణ్ భన్సాలీ కాంబో మూవీ పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పాలించిన వీరుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మన దేశంలోని గొప్ప రాజులలో సహేల్ దేవ్ ఒకరు కాగా నేటి తరం ప్రజలకు పెద్దగా తెలియని ఈ రాజు కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో ఒకరు కాగా ఈ దర్శకుడి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.

సంజయ్ లీలా భన్సాలీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం ఫ్యాన్స్ ను మెప్పిస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ తీసినా ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదని చరణ్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో మూవీకి నిర్మాత ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. (Ram Charan) రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus