Ram Charan: అయ్యప్ప మాలతో సిద్ధి వినాయక ఆలయం సందర్శించిన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులు లేకపోయినప్పటికీ ఈయన మాత్రం ఏదో ఒక కార్యక్రమాలకు అటెండ్ అవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి స్వామి వారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఉన్నఫలంగా సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రాంచరణ్ ప్రతి ఏడాది కూడా అయ్యప్ప మాల వేస్తారు అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలలో భాగంగా అయ్యప్ప మాలతో మొదటిసారి కనిపించారు. అయితే ఇన్ని రోజులు పాటు మాలలో ఉన్నటువంటి చరణ్ తాజాగా ముంబై వెళ్లి స్వామివారి మాల విరమించినట్టు తెలుస్తోంది. తాజాగా చరణ్, ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

అయితే నేడు ఉదయం సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం ఈ ఆలయంలోనే రామ్ చరణ్ అయ్యప్ప మాల విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ రెండవ వారం నుంచి ఈయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. ఈ క్రమంలోనే (Ram Charan) చరణ్ అయ్యప్ప మాల తొలగించారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది దీంతో వచ్చే వారంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే హైదరాబాద్లో ప్రత్యేకంగా సెట్ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus