Ram Charan, Shankar: శంకర్ మూవీలో చరణ్ ఎంట్రీ సీన్ అలా ఉండనుందా?

చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఇతర భాషలలో కూడా సత్తా చాటాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఆ కారణం వల్లే దిల్ రాజు ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదనే సంగతి తెలిసిందే. శంకర్ కు సైతం ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ముఖ్యమనే విషయం తెలిసిందే.

శంకర్ మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని ఈ సీన్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలతో సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. 10 కోట్ల రూపాయలతో సులువుగా రెండు చిన్న సినిమాల షూట్ ను పూర్తి చేయవచ్చు. చరణ్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. 10 కోట్ల రూపాయల సెట్ లో చిత్రీకరించే ఈ సీన్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సోలో హీరోగా చరణ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో చరణ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఆచార్య సినిమాతో చరణ్ ఖాతాలో ఫ్లాప్ చేరగా ఈ సినిమాతో చరణ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. దిల్ రాజు రెమ్యునరేషన్ల కోసమే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. దిల్ రాజు ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా వరుస విజయాలను అందుకోనున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో దిల్ రాజు విజయాలను అందుకుంటారేమో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus