Ram Charan, Shankar: శంకర్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందిగా!

దర్శకుడు శంకర్ సినిమాలంటే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో పాటలు, యాక్షన్ సీన్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటారాయన. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి ‘సర్కారోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాలో పాటను చిత్రీకరించారు. ఈ ఒక్క పాట కోసం రూ.9 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Click Here To Watch NOW

అలానే ఆ మధ్య వేరే రాష్ట్రంలో ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. దానికి కూడా పది కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ లు, సీజీ, గ్రీన్ మ్యాట్ లేని రోజుల్లో కూడా శంకర్ సినిమాలు చాలా కలర్ ఫుల్ గా భారీగా ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తరువాత మరింత గ్రాండ్ గా సినిమాలు తీస్తున్నారు శంకర్. ఈసారి కూడా భారీగా సెటప్ చేస్తుండడంతో ఖర్చు కూడా అదే రేంజ్ లో అవుతుందని సమాచారం.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. స్టూడెంట్ గా, ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారట. ప్రస్తుతం స్టూడెంట్ గెటప్ లో ఉండే కాలేజీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు చిత్రీకరించడానికి అమృత్ సర్ లో లొకేషన్స్ ఎంచుకున్నారు. కొద్దిరోజుల్లో అక్కడ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం విశాఖలో హీరో ఇంటి సెట్ వేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ అంచనాతో ముందుకు వెళ్తున్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2023 ఏప్రిల్ లో విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus