టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుండటం వల్లే ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.
అయితే రామ్ చరణ్ (Ram Charan) నిర్మాతగా మారి నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ది ఇండియా హౌస్ కు నిర్మాణ భాగస్వామిలలో ఒకరిగా ఉన్నారు. ఈ సినిమాను వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి చరణ్ ఎలా ఎంట్రీ ఇచ్చాడనే ప్రశ్నకు సంబంధించి నిర్మాత అభిషేక్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఒక సందర్భంలో రామ్ చరణ్ ఈ సినిమా కథ విన్నాడని ఆయన తెలిపారు.
రామ్ చరణ్ కు ఈ సినిమా కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు తాను కూడా ఒక నిర్మాతగా ఉంటానని చెప్పాడని అభిషేక్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. చరణ్ వాటా 50 శాతం ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. వీర్ సావర్కర్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని అయితే ఆయన బయోపిక్ మాత్రం కాదని చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ ఇప్పటికే పలు సినిమాలను నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రామ్ చరణ్ మరిన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు