Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను అభినందించిన రామ్ చరణ్ ..ఆ విషయమేనా?

శుభకార్యాలు మంచి పనులతోను, సంతోషంతోను స్టార్ట్ అవుతాయి. కానీ విజయదేవరకొండ పుట్టిన రోజు మాత్రం వివాదంతో స్టార్ట్ అయిందని చెప్పాలి. పుట్టిన రోజుకు వారం రోజుల ముందే అనసూయ పుణ్యమా అని వార్తల్లో నిలిచి తెగ ట్రెండ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విజయ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పడంతో పాటు ఆయన అభిమానులు చేసిన పనిని రామ్ చరణ్ కొనియాడారు.

తమ హీరో పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. అందుకే, వాళ్లను రామ్ చరణ్ మెచ్చుకున్నారు. తాజాగా రౌడీ స్టార్ విజయదేవరకొండ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసిన ఆయన.. విజయ్‌కు విషెస్ చెప్పడంతో పాటు అతని అభిమానులు చేసిన పనిని మెచ్చుకున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా విజయ్ అభిమానులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు.

దీనిపై హర్షం వ్యక్తం చేసిన చెర్రీ.. నీ ఫ్యాన్స్ ‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే చరణ్ ట్వీట్‌కు స్పందించారు విజయ్ దేవరకొండ. చరణ్ థ్యాంక్యూ అన్న అంటూ రిప్లయ్ ఇచ్చారు. తన అభిమానులు తనను ఎల్లప్పుడూ గర్వపడేలా, సంతోషంగా వుండేలా చేస్తారని విజయ్ కొనియాడారు. మీరు చేసిన కామెంట్స్ వారు వింటే ఎంతో సంతోషిస్తారని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరికొందరు రామ్ చరణ్ అనసూయకు కౌంటర్ ఇవ్వడం కోసమే ట్వీట్ చేశారని చెప్పుకుంటున్నారు.

ఇక సినిమాల సంగతికి వస్తే (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వరపరిచి, ఆలపించిన ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఈరోజు విడుదల చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus