ఉపాసనతో రామ్‌చరణ్ అమెరికాలో స్పెషల్ ఫోటోషూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటం వల్ల మార్చి 12వ తేదీన జరుగనుంది. ఈ ఆస్కార్ అవార్డ్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చరణ్ తో పాటు త్రిబుల్ ఆర్ టీం కూడా పాల్గొన్నారు. ఇక రామ్ చరణ్ అమెరికాలో ఉండడంతో తాజాగా ఆయన సతీమణి ఉపాసన కూడా అమెరికాకి వెళ్ళింది. రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ తన భారీ ఉపాసనకు కాస్త టైం కేటాయించి తనతో పాటు సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. “మిస్టర్ సి తన బిజీ షెడ్యూల్లో కూడా మాతో సమయాన్ని గడపటం చాలా సంతోషంగా ఉంది. స్నిక్ పీక్ బేబీ మూన్ ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus