మహేష్, పవన్ తర్వాతి స్థానంలో నిలిచిన రామ్ చరణ్

  • March 3, 2018 / 06:10 AM IST

టాలీవుడ్ లో స్టార్స్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి స్థానాన్ని మరొకరు అధిగమించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నం రికార్డుల రూపంలో కనిపిస్తుంటుంది. ఇది వరకు అనేక ఏళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానంలో కొనసాగారు. ఆ తరవాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య నంబర్ల పోటీ నెలకొన్నింది. వీరే కాదు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా నంబర్ వన్ స్థానంలో రేసులో ఉన్నవారే. అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తర్వాత స్థానాన్ని రామ్ చరణ్ తేజ్ కైవశం చేసుకొని ఆశ్చర్యపరిచారు. ఎంతోమంది పోటీలో ఉండగా చరణ్ ఆ స్థానం ఎలా దక్కిందని?, ఎలా అతను ఆ స్థానంలో నిలబడ్డారు? అని అనుమానం రావచ్చు.

టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో గురించి జరుగుతున్న పోటీలో చరణ్ కి ఈ స్థానాన్ని ఇవ్వలేదు. కేవలం ఆడియోరైట్స్ కి పలికిన ధరను బట్టి చరణ్ మూడో స్థానములో ఉన్నారని చెప్పాము. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన రంగస్థలం ఆడియో రైట్స్ 1.6 కోట్లకు అమ్ముడు పోయి టాలీవుడ్‌లో భారీ ధరకు అమ్ముడుపోయిన చిత్రాలలో మూడో స్థానం (నాన్ బాహుబలి)లో నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు మహేష్ బాబు “భరత్ అనే నేను” 2 కోట్లు, పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” 2 కోట్లతో 1, 2 స్థానాలను ఆక్రమించుకున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించిన “రంగస్థలం” ఈనెల 30 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus