Ram Charan: ఆమే నా ఫస్ట్‌ క్రష్‌.. ఆ హీరోయిన్‌ గురించి చరణ్‌ మాటలు విన్నారా?

వాలెంటైన్స్‌ డే నాడు బయటికొచ్చిన ఓ వీడియో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుష్‌ చేసింది. అదే ఫస్ట్‌ క్రష్‌ గురించి రామ్‌చరణ్‌ చెప్పిన వీడియో. ఓ ఆంగ్ల యూట్యూబ్‌ ఛానల్‌కి రామ్‌చరణ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హోస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నకు రామ్‌చరణ్‌ చెప్పాడు. ఆ సమాధానమే టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారింది. అయితే అదేమంత పెద్ద ప్రశ్న కాదు. జస్ట్‌ మీ క్రష్‌ ఎవరు అనేదే అక్కడ ప్రశ్న.

హీరోయిన్లలో మీకు ఎవరంటే క్రష్‌ అని.. యాంకర్‌ అడిగింది. దానికి ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఇబ్బంది పడ్డ రామ్‌చరణ్‌.. ఆ తర్వాత ఆన్సర్‌ చెప్పాడు. హాలీవుడ్‌ హీరోయిన్స్‌ జూలియా రాబర్ట్స్, కేథరిన్ జిటా జోన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన రామ్‌చరణ్‌ వాళ్ల గురించి, వాళ్ల సినిమాల గురించి కూడా వివరించాడు. జూలియా రాబర్ట్స్‌ను టీవీలో చూసినా, బిగ్‌ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను అని రామ్‌చరణ్‌ చెప్పాడు. జూలియా అంతగా తనను ఆకర్షిస్తుంది అని చెప్పాడు.

జూలియా రాబర్ట్స్‌ ‘ప్రెట్టీ ఉమెన్‌’ సినిమా చూశాక ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను అని చెప్పాడు రామ్‌ చరణ్‌. ‘ది మార్క్‌ ఆఫ్‌ జోరో’ అనే సినిమా చూసి కేథరిన్‌ జిటా జోన్స్‌ నటన నన్నెంతో ఆకట్టుకుందని చెప్పాడు. హాలీవుడ్‌ హీరోయిన్ల గురించి చరణ్‌ అలా చెప్పడం.. ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుష్‌ చేసింది. దీంతో ఈ ఇంటర్వ్యూ ఏదో కొత్తగా ఉందని, ఫుల్‌ ఎపిసోడ్‌ ఎక్కడ, ఎప్పుడు వస్తుందో చెప్పండని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇక చరణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం శంకర్‌ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సినిమా మొదలవుతుంది. శంకర్‌ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారని సమాచారం. బుచ్చిబాబు సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కావొచ్చని టాక్‌.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus