Ram Charan: పెద్ద షాక్ ఇచ్చిన రాంచరణ్.. ఏమైందంటే?

Ad not loaded.

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ‘మెగా వర్సెస్ అల్లు’ యుద్ధం నడుస్తోంది. ఇది ఎందుకు నడుస్తుంది? అసలు ఎక్కడ తేడా కొట్టింది? అనేది చాలా మందికి తెలీదు. 2024 ఎన్నికల టైంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ (Allu Arjun)  నంద్యాల వెళ్లారు. అక్కడి నుండి ఇదంతా మొదలైంది? అని అంతా అనుకుంటున్నారు. కానీ అది కాదు. అంతకు ముందు నుండే అల్లు అర్జున్.. మెగా అనే బ్రాండ్ కి దూరంగా ఉండాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Ram Charan

తన పీఆర్ టీం, మార్కెటింగ్ టీంని పెంచుకున్నాడు. బాలీవుడ్ హీరోల స్టైల్లో ఇక్కడ తన ప్రమోషనల్ టీంని మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇదంతా ‘మెగా’ అనే బ్రాండ్ ను దూరం చేయడానికి అనేది కొందరి వాదన. ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  అభిమానులకి చురకలు అంటించినప్పుడు బన్నీకి అండగా నిలిచింది మెగా ఫ్యామిలీ. చిరు (Chiranjeevi)   అభిమానులు కూడా అల్లు అర్జున్ కి అండగా నిలబడ్డారు.

ఆ తర్వాత ఎక్కడ తేడా కొట్టింది? అనేది ఎవ్వరికీ తెలీదు. కానీ మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లో జరిగే పండుగలకు అల్లు అర్జున్ వెళ్లిన ఫోటోలు అతని పీఆర్ టీం బయటకు వదులుతూ వచ్చి మేనేజ్ చేసింది. నంద్యాల ఎపిసోడ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) .. అల్లు అర్జున్ ని ట్విట్టర్లో అన్ ఫాలో చేశాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఇటీవల అల్లు అరవింద్ (Allu Aravind)  పరోక్షంగా రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  పై సెటైర్లు వేయడం..

ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha) యావరేజ్ సినిమా అంటూ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం జరిగింది. తర్వాత ‘గేమ్ ఛేంజర్’ విషయంలో చరణ్ అభిమానులకు సారీ చెప్పిన అల్లు అరవింద్.. ‘చిరుత’ పై చేసిన కామెంట్స్ గురించి మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉండగా.. ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో.. ఇంకో షాకిచ్చాడు రాంచరణ్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అల్లు అర్జున్ ను అతను అన్ ఫాలో చేశాడట. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఇది ‘మెగా వర్సెస్ అల్లు’ ని మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది అనేది కొందరి అభిప్రాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus