మెగా కోడలు ఉపాసన కామినేని రైతుగా మారారు. ఆమె వాళ్ళ నాన్నగారు అనిల్ కామినేని తో కలిసి ఫార్మ్ ల్యాండ్ లో ఆర్గానిక్ వ్యవసాయం గురించి నేర్చుకుంటున్నారట. అలాగే ఆహారం వృద్దా కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారాన్ని మరలా ఉపయోగకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు వంటి సంగతులతో పాటు, సేంద్రియ ఎరువుల తయారీ గురించి కూడా తెలుసుకుంటున్నారట. ఈ విషయాలను, వాటికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక ఉపాసన చరణ్ వైఫ్ గానే కాకుండా యంగ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపాసన సొంతగా బి పాజిటివ్ అనే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్ తరుపున అనేక మంది బాలీవుడ్ మరియు టాలీవుడ్ సెలెబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేశారు. అపోలో ఫౌండేషన్ తరుపున అనేక సేవా కార్యక్రమాలను కూడా ఉపాసన నిర్వహిస్తారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం అపోలో స్టోర్స్ నందు ఉచిత మెడిసిన్ అందించే బాధ్యత తీసుకున్నారు ఉపాసన.
గత ఏడాది హస్బెండ్ చరణ్ తో కలిసి ఆఫ్రికా వైల్డ్ సఫారీకి వెళ్ళాడు. వీరి సహస యాత్రలో తీసిన ఫోటోలను టాలీవుడ్లో తన సన్నిహితులకు ఎక్సిహిబిషన్ పెట్టి చూపించారు. చరణ్ ఫిట్నెస్ మరియు డైట్ విషయంలో ఉపాసన గైడ్ కావడం విశేషం. మెగా కోడలుగా ఉపాసన అనేక ప్రత్యేకలతో మామ చిరంజీవి తగ్గ కోడలు అనిపించుకుంటుంది.
Gobar Girl with Dad – the Modern Day Farmer. 😛🥰❤️
Learning organic farming, composting, how to reduce/re use food waste & the beauty of adapting sustainable lifestyle. pic.twitter.com/3iNJ69fRHF
— Upasana Konidela (@upasanakonidela) May 14, 2020