రాజమౌళి చరిత్రకు దూరంగా తన క్రియేటివిటీకి దగ్గరగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడియోతోనే ఇది అర్థమైపోయింది. చరణ్ ని పోలీస్ గా చూపించడం, కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ చేత మా అన్న అల్లూరి అనిపించడం ఈయన క్రియేటివిటీలో భాగమే. అల్లూరి, కొమరం భీమ్ పేర్లు మాత్రమే ఆయన తీసుకొని ఈ కథ అల్లు కొని సినిమా తీస్తున్నారు. చరిత్ర సంగతి ఎలా ఉన్నా సినిమా బాగుంటే కోట్ల వర్షం కురిపిస్తుంది.
ఇక రామ్ చరణ్ ఈ పాత్ర కోసం బాక్సింగ్ కిక్స్ నేర్చుకుంటున్నారు. ఆయనకు ప్రొఫెషనల్ బాక్సర్లు ఎందులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ అల్లూరిగా బాక్సింగ్ రింగ్ లో దిగనున్నాడని అర్థం అవుతుంది. ఐతే అసలు మన్యం వీరుడిని బాక్సింగ్ ప్రొఫెషనల్ గా ఎలా చూపిస్తాడు అనేది అసలు విషయం. అలాగే ఇక్కడ చరణ్ బాక్సింగ్ రింగ్ లో దిగి ఎవరితో పోరాడతాడు అనేది కూడా ఆసక్తికర అంశం. యాక్షన్ ఎలివేషన్స్ కోసం అనేక రకాల యుద్ధ విద్యలలో రాజమౌళి వీరిని చూపించనున్నాడని తెలుస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోల యాక్షన్ మీదే రాజమౌళి ఫోకస్ పెడుతున్నారు. చరణ్ ఇప్పటికే విలుకాడిగా, షూటర్ గా, బాక్సర్ గా కనిపిస్తున్నాడు. మరి మరో హీరో ఎన్టీఆర్ ఎన్ని అవతారంలో ఎన్ని యుద్ధ విద్యలు ప్రదర్శించనున్నాడో చూడాలి. ఆయన పాత్రపై క్లారిటీ రావాలంటే మరో రెండు వారాల్లో క్లారిటీ రావడం ఖాయం. ఇక ఆర్ ఆర్ ఆర్ జనవరి 8న 2021లో విడుదల కానుంది.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు