రామ్ చరణ్ (Ram Charan) RRR (RRR Movie)సినిమా తరువాత నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త కథలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే టైమ్ కూడా వృధా కాకుండా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇక ‘ఆర్సీ 17’ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఖరారైన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’తో (Rangasthalam) సుకుమార్ (Sukumar) రామ్ చరణ్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. దీంతో గేమ్ ఛేంజర్ (Game changer) అనంతరం మళ్ళీ జెట్ స్పీడ్ లో మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సుకుమార్, శిష్యుడి ప్రాజెక్ట్ పెద్ది పూర్తయ్యే వరకు వేచి చూడాలని నిర్ణయించాడు.
అయితే, తాజాగా మెగా క్యాంప్ నుంచి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘ఆర్సీ 17’ కోసం సుకుమార్ స్థానంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram) తీసుకొచ్చే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. ఈ కథను మొదట పవన్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశాడు, కానీ పవన్ ఈ స్క్రిప్ట్ రామ్ చరణ్‌కు బాగా సెట్ అవుతుందని భావించి, త్రివిక్రమ్‌ను ఒప్పించాడట. స్క్రిప్ట్ విన్న రామ్ చరణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు, ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించాలని పవన్ సూచించాడని వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచనలను రామ్ చరణ్ ఎప్పుడూ కాదనలేడు, అలాగే త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ బ్యానర్‌తో పాటు పవన్ సొంత నిర్మాణ సంస్థలోనూ నిర్మించే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ‘ఆర్సీ 17’ డైరెక్టర్ మార్పు ఖాయమని, సుకుమార్ స్థానంలో త్రివిక్రమ్ వస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు, ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ మరోవైపు వెంకీ తో ఓ సినిమా అనుకుంటున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) (ఆర్సీ 16) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor), శివరాజ్‌కుమార్(Shiva Rajkumar) సహా పలువురు నటిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుందని సమాచారం. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ సుకుమార్‌తో ‘ఆర్సీ 17’ చేస్తాడని అనుకున్నారు, కానీ త్రివిక్రమ్‌తో సినిమా ప్లాన్ నిజమైతే, సుకుమార్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవ్వొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.