గతేడాది అంటే.. 2018 లో ‘రంగస్థలం’ చిత్రంతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. అప్పటి వరకూ తన నటన విషయంలో కామెంట్స్ చేసిన వారికి.. ఈ చిత్రం గట్టి సమాధానమే చెప్పిందని చెప్పాలి. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ జీవించేసాడు. దర్శకుడు సుకుమార్ ఈ పాత్రని చాలా బాగా చూపించాడు. ఈ చిత్రానికి ముందు రాంచరణ్ ‘ధృవ’ చిత్రంతో కూడా బాగా ఆకట్టుకున్నాడు. ‘వరుసగా రొటీన్ మాస్ సినిమాలు చేస్తున్నాడు చరణ్’ అనే ముద్రను కూడా ‘ధృవ’ తుడిచిపెట్టింది. రాంచరణ్ స్టోరీ సెలక్షన్ లోనూ నటనలోనూ బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనుకుంటున్నా టైములో ‘వినయ విధేయ రామ’ చిత్రం పెద్ద షాక్ ఇచ్చింది.
బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం చేసినందుకు బోయపాటి మీద మాత్రమే కాదు హీరో చరణ్ మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. ట్రైన్ పైన నిలబడి నార్త్ కు ప్రయాణించడం… విలన్ తమ్ముళ్ల తలలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్ళడం’ వంటి సీన్ల పై భయంకరమైన ట్రోల్స్ పడ్డాయి. మళ్ళీ చరణ్ అదే రొటీన్ కథల్ని ఎంచుకున్నాడేంటి అని అభిమానులు సైతం నెత్తి కొట్టుకున్నారు. అలా 2019 ట్రోలింగ్ లిస్ట్ లో చరణ్ నెంబర్ 1 గా నిలిచాడు. ఇదంతా బోయపాటి మహిమే.. కానీ చరణ్ ది తప్పు కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చరణ్.. ఎన్టీఆర్ తో కలిసి.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. 2020 జూలై 30న ఈ చిత్రం విడుదల చేయడానికి దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?