Ram Gopal Varma, Jyothi: వర్మ.. ఏంటి మాకు ఈ ఖర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కొన్నాళ్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా ఎక్కువుగా ప్రేక్షకాభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ముఖ్యంగా ఆ మధ్య బిగ్ బాస్ ఫేమ్ అరియనా తో కలిసి మంచి రొమాంటిక్ ఇంటర్వ్యూ ని తన సొంత యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నట్లు చెప్పిన వర్మ, ఆ వీడియో తరువాత పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వడం జరిగింది.

మిగతా వారి సంగతేమో కానీ ఆయన మాత్రం సోషల్ మీడియాని బాగానే వాడుతున్నారని అంటున్నారు. ఇక ఇటీవల జరిగిన ఒక టాలీవుడ్ నటి బర్త్ డే వేడుకల్లో మద్యం తాగి ఆ పార్టీ లో పాల్గొన్న వర్మ, సదరు నటితో పాటు మరొక సీనియర్ నటి జ్యోతి తో కలిసి హగ్ లు ముద్దుల వంటివి ఇస్తూ కొంత జుజుబీ చేసారని చెప్పాలి. ఇక ఆ బర్త్ డే వీడియో సోషల్ మెడిలో వైరల్ కాగా, దానికి కొనసాగింపుగా వర్మ ఏకంగా మందు గ్లాస్ పట్టుకుని చక్కగా తాగుతూ ఆ సమయంలో రంగీలా మూవీలోని యాయీరే సాంగ్ కి నటి జ్యోతి వేస్తున్న స్టెప్స్ కి మైమరచిపోయి కిందపడి దొర్లుతూ రకరకాలుగా చిందులు వేయడం జరిగింది.

ఆ మద్యం మత్తులో వర్మ వేసిన చిందులు, జ్యోతి చేసిన డ్యాన్స్ రచ్చ వీడియో కూడా ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతోంది. మొత్తంగా వర్మ తన స్టైలే వేరని, తనకి తానే సాటి అని, తన లైఫ్ తనకు నచ్చిన విధంగా బ్రతుకుతానని నిరూపించుకున్నారు, ఆయనని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఫ్యాన్స్ కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఏమయ్యా వర్మా అసలు ఏమిటి మాకు ఈ ఖర్మ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వర్మపై విమర్శలతో కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus