Ram Gopal Varma: ‘వ్యూహం’ టీజర్‌ వచ్చేసింది… ఏపీ రాజకీయం రంగు మారబోతోంది!

  • June 24, 2023 / 04:55 PM IST

రాజకీయం – సినిమా.. ఈ బంధం ఈ మధ్యది కాదు. ఎన్నో దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన పాలిటిక్స్‌ చేస్తే ఓకే కానీ… రాజకీయాల్ని సినిమాలో చూపిస్తే మాత్రం ఇబ్బందే. జరిగింది జరిగినట్లు చూపిస్తే ఓ సమస్య, జరగనిది జరిగినట్లు చూపిస్తే ఇంకో సమస్య. ఇలాంటి సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ వచ్చి గతంలో ఓ సినిమా చేశారు. నందమూరి తారక రామారావు గురించి, ఆయన పార్టీ గురించి అందులో చూపించారు. అప్పుడు ఇబ్బంది పడింది టీడీపీ వాళ్లే. ఇప్పుడు ఆయన చూపు వైఎస్‌ఆర్‌సీపీ మీద పడింది.

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితం గురించి ఆయన సినిమాలు తీస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో తొలి పార్టు టీజర్‌ ఈ రోజు విడుదలైంది. దీంతో ఏపీ రాజీకీయాల్లో మంటలు రేగడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే జరిగిన దానిని తనకు అనుకూలంగా చేసుకుని వర్మ చూపించారు అనేది టీజర్‌ చూసి కొందరు లెక్కలేస్తున్నారు. ‘వ్యూహం’ ప్రారంభమే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూపించారు (Ram Gopal Varma) రామ్ గోపాల్ వర్మ. ముఖ్యమంత్రి హోదాలో మరణానికి ముందు చేసిన హెలికాప్టర్ విజువల్స్ ఉపయోగించారు.

వైఎస్‌ మరణం, ఆ తర్వాత జగన్‌పై సీబీఐ కేసులు పెట్టడం, పార్టీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులను ‘వ్యూహం’లో చూపించారని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇదంతా వైఎస్‌ఆర్‌సీపీకి, జగన్‌కి మేలు చేసేలా ఉన్నాయని అర్థమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రధారిని విలన్‌గా చూపించే ప్రయత్నం జరిగింది అనొచ్చు. ‘వ్యూహం’ సినిమా టీజర్ చివరి డైలాగులో చంద్రబాబు ప్రస్తావన ఉంది. ‘అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు’ అని జగన్ పాత్రధారి చేత డైలాగ్ చెప్పించారు వర్మ.

జగన్‌ పాత్రలో తమిళ నటుడు, ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్ నటించాడు. భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంత చూపించి ‘వ్యూహం’ బయోపిక్‌ కాదని వర్మ చెబుతున్నారు. బయోపిక్ కంటే చాలా లోతైన రియల్‌ సినిమా అంటున్నారు. అయితే టీజర్‌లో చూపించిన నవ్వులు, లుక్కుల ఏపీలో రాజకీయ వేడి పెంచుతాయని చెప్పొచ్చు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus