మిస్టేక్ వర్మది అయితే పనిష్మెంట్ ఆమెకి పడింది

చెప్పలేనంత టాలెంట్, ఎవరికీ దొరకని తత్త్వం, అనిపించింది చేసేయడం, అనేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైజం. ఆయన ప్రవర్తన ఇది అని చెప్పడానికి పదాలు లేవు. బంధాలు లేని, భగవంతుడిని నమ్మని ఈ యోగి కానీ భోగి జీవితం చరిత్రంతా వెతికినా దొరకని కొత్త అధ్యాయం. మరి ఇలాంటి వర్మ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు?.ఓ ఆడపిల్లకు ఎలా జన్మనిచ్చాడు అంటే దానికి కూడా వర్మ దగ్గర సమాధానం ఉంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మారక ముందే రత్న అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి చిత్రం శివ చిత్రీకరణ సమయంలో వర్మకు కూతురు పుట్టింది. భార్య, పిల్లలు సంసారం గురించి అడిగితే వర్మ చెప్పిన సమాధానం..”తెలియని వయసులో ప్రేమ వివాహం చేసుకున్నాను. నాకు మనుషులతో బంధాలు ఏర్పరుచుకోవడం ఇష్టం ఉండదు. నన్ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమెకు తెలిసింది నేను చాలా సెల్ఫిష్ అని. పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు, దానికి పనిష్మెంట్ మాత్రం నా భార్య అనుభవించింది.

ఇక నాకూతురు పుట్టినప్పుడు ఎవరో కంగ్రాట్స్ చెవితే వింతగా అనిపించింది, ఎవడైనా తండ్రి కాగలడు.. దానికి కంగ్రాట్స్ ఏమిటని అనిపించింది. అమెరికాలో ఉన్న నా కూతుర్ని నేను కలవను,తను నన్ను జూలో జంతువులా చూస్తుంది. అలా నన్ను ఓ జంతువులా భావించే వారు నాతో రిలేషన్ ఎంజాయ్ చేస్తారు. మనుషులతో అవసరం ఉంటే తప్పా నాకు వాళ్ళు గుర్తుకురారు. నేను సెల్ఫిష్ మాత్రమే కాదు, సెల్ఫ్ సెంటర్డ్” అని వర్మ చెప్పుకొచ్చారు.


అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus