టికెట్ రేట్ల ఇష్యు : ఏపి ప్రభుత్వం తీరు పై సెటైర్లు.. ఆర్జీవీ పై ప్రశంసలు..!

కరోనా వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకున్న తరుణంలో ఏపి ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేసి పెద్ద సినిమాలు విడుదల కాకుండా చేస్తుంది. పెద్ద సినిమాలనే కాదు.. విడుదలవుతున్న మిడ్ రేంజ్ సినిమాలు కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి ఏర్పడుతుంది.అంతేకాకుండా ఇటీవల 100 కి పైగా థియేటర్లను సీజ్ చేసింది ఏపి ప్రభుత్వం. అక్కడి సినిమాటోగ్రాఫర్ మంత్రితో అలాగే ముఖ్యమంత్రితో మన నిర్మాతలు మీటింగ్లు జరుపుతున్నా పరిస్థితి ఓ కొలిక్కి రావడం లేదు.

ఈ ఇష్యు పై రోజుకో సెలబ్రిటీ పలు సినిమాల వేదికల పై ప్రస్తావిస్తూ వస్తున్నారు. మొన్న నాని, నిన్న శ్రీవిష్ణు .. ఇప్పుడు ఆర్జీవీ వంటి వారు టికెట్ రేట్ల ఇష్యు పై స్పందించారు. ఆర్జీవీ అయితే గత రెండు, మూడు రోజులుగా టికెట్ రేట్ల ఇష్యు పై స్పందిస్తూ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ… “సినిమా అనేది వినోదం, విజ్ఞానం..మీకు కాకపోవచ్చు.

కాబట్టి వినోదాన్ని,విజ్ఞానాన్ని పేదవాడికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది… అందుబాటులో లేకపోతే అందుబాటులో సృష్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది కదా” అంటూ ప్రశ్నించాడు. దీనికి రాంగోపాల్ వర్మ బదులిస్తూ.. “అందుబాటులో ఎక్కడ లేదు.. అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వాన్నే సినిమాలు నిర్మించమనండి” అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఓ సందర్భంలో ‘ప్రభుత్వానికి పేదవాడి పై అంత ప్రేమ ఉంటే నిత్యావసరాలను తగ్గించమనండి’ అంటూ కూడా ఆయన కౌంటర్లు వేసాడు.ఎవ్వరూ చెప్పలేని సమాధానాలను వర్మ చెబుతుండడంతో ఆయన పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus