బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనాతో కయ్యం పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కంగనాను టార్గెట్ చేస్తున్నాడు. దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఫిబ్రవరిలో రిలీజ్ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆ సినిమాకు పోటీగా తన ‘శశికళ’ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. జయలలిత స్నేహితురాలైన శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నట్లు వర్మ ఇదివరకే ప్రకటించాడు. కానీ ఈ సినిమా ఎలాంటి అప్డేట్లు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. గతంలో వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా త్వరలోనే పూర్తవుతుందని.. కంగనా నటించిన ‘తలైవి’ సినిమా విడుదలయ్యే రోజునే ‘శశికళ’ సినిమాను రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించారు. ‘తలైవి’ సినిమాలో శశికళ పాత్రకు చోటుండదని.. కానీ తన సినిమాలో శశికళతో పాటు జయలలిత పాత్రను చూపించబోతున్నట్లు చెప్పారు. అలానే పన్నీర్ సెల్వం, పళని స్వామిల పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. ‘తలైవి’ టీమ్ ని టార్గెట్ చేస్తూ వర్మ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!