వర్మ చలువతో అప్సర స్టార్ హీరోయిన్ అయిపోదు కదా…!

వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయినప్పటికీ రాంగోపాల్ వర్మ మాత్రం పలు సినిమాలు తీసి ఓటిటి లో విడుదల చేస్తూనే ఉన్నాడు. అక్కడితో ఆగడం వాటి ట్రైలర్స్ లో విడుదల చేసి ఎక్కడ లేని వివాదాలు సృష్టిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే రెండు అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసాడు. తరువాత ‘పవర్ స్టార్’ అనే సినిమాని తెరకెక్కించి నానా రచ్చ చేసాడు. ఇప్పుడు ‘మర్డdr’ ‘థ్రిల్లర్’ అనే చిత్రాలు కూడా తెరకెక్కించాడు.

ఆ రెండు సినిమాలు కూడా త్వరలోనే ఓటిటి లో విడుదల కాబోతున్నాయి.ఇది పక్కన పెడితే… ‘థ్రిల్లర్’ అనే చిత్రంలో అప్సర అనే బ్యూటీని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. అదేంటో కానీ.. వర్మ ఈ బ్యూటీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. అంతేకాదు తన తరువాతి సినిమా ‘డేంజరస్’ అనే చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్ గా ఎంచుకున్నాడు. లెస్ బియన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు కూడా వర్మ తెలిపాడు. ‘అప్సర అందానికి ఫిదా అయిపోయాను’ అంటూ నిత్యం ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నాడు వర్మ.

గతంలో ఈమె కొన్ని మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈమెకు ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. కానీ వర్మ చేతిలో పడిన తరువాత ఈమెకు ఫాలోయింగ్ పెరిగింది. ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసే రేంజ్ లో వర్మ పబ్లిసిటీ చేస్తున్నాడు. మరి ఆ స్థాయిలో ఈమె సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus