త్రివిక్రమ్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన రామ్..!

గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్.. తన తరువాతి చిత్రాన్ని ఎన్టీఆర్ తో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో చేయబోతున్నట్టు ప్రకటించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంకా పూర్తికాని నేపథ్యం.. అందులోనూ కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడి షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో .. ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది.

ఈ క్రమంలో త్రివిక్రమ్ తన తరువాతి సినిమాని మహేష్ బాబు తో చేస్తున్నాడని కొన్ని రోజులు.. లేదు రామ్ తో చేస్తున్నాడని మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఫైనల్ గా రామ్ తోనే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. రామ్ పెదనాన్న స్రవంతి రవి కిశోర్ కు అలాగే త్రివిక్రమ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ కారణంగానే రామ్ తో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఇంకా ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రాలేదు.దీంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది.

అసలు త్రివిక్రమ్ -రామ్ కాంబోలో సినిమా ఉంటుందా? లేక అదంతా అసత్యప్రచారమా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇదే విషయం పై రామ్ ను ప్రశ్నించగా.. ‘త్రివిక్రమ్ గారితో నా సినిమా కచ్చితంగా ఉంటుంది. దీని పై ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus