Boyapati Srinu: ఘనంగా దర్శకుడు బోయపాటి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బోయపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఏప్రిల్ 25వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బోయపాటి పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. బోయపాటి 1970 ఏప్రిల్ 25వ తేదీన గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో జన్మించారు. ఇక ఈ ఏప్రిల్ 25వ తేదీ ఈయన పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు.

ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో హీరో రామ్ పోతినేని అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల సందడి చేశారు. ప్రస్తుతం బోయపాటి హీరో రామ్ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృంద సమక్షంలో ఈయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే చిత్ర బృందం సమక్షంలో బోయపాటి చేత కేక్ కట్ చేయించి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ప్రస్తుతం ఇది సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా ఈయన పుట్టినరోజు వేడుకలలో నటుడు శ్రీకాంత్ కూడా పాల్గొని సందడి చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడుగా బోయపాటి (Boyapati Srinu) ఇండస్ట్రీలో దాదాపు 18 సంవత్సరాలుగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన యాక్షన్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక బోయపాటి అఖండ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని హీరో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus