Ram Pothineni: వైరల్ అవుతున్న రామ్ ఓల్డ్ వీడియో.. ఈ హీరోల మధ్య బంధుత్వం ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) మధ్య బంధుత్వం ఉందంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ హీరోల మధ్య నిజంగానే బంధుత్వం ఉందా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఒక ఈవెంట్ లో భాగంగా రామ్ చేసిన కామెంట్ల వల్ల ఈ వార్తలు పుట్టుకొచ్చాయని సమాచారం అందుతోంది. ఒక ఈవెంట్ లో రామ్ పోతినేని జూనియర్ ఎన్టీఆర్ తనకు అన్నయ్య అవుతారని ఆ లెక్క ప్రకారం బాలయ్య (Nandamuri Balakrishna) నాకు బాబాయ్ అవుతారని చెప్పుకొచ్చారు.

అయితే రామ్ అభిమానంతో బాలయ్య, ఎన్టీఆర్ లను బాబాయ్ అన్నయ్య అని పిలిచారే తప్ప నందమూరి హీరోల కుటుంబాలకు, రామ్ పోతినేని కుటుంబానికి బంధుత్వం లేదు. రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తో (Double Ismart) బిజీగా ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా స్క్రిప్ట్ విషయంలో పూరీ జగన్నాథ్  (Puri Jagannadh) ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

లైగర్ (Liger) డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత పూరీ జగన్నాథ్ పై ఉంది. పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ సైతం ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. రామ్ పోతినేని ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నా ఆయన స్థాయికి తగ్గ సక్సెస్ దక్కడం లేదు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రామ్ కు ఆ లోటు తీరుతుందేమో చూడాలి. జూన్ నెలలో ఇండియన్2 (Indian 2), కల్కి (Kalki 2898 AD) సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ జులైలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు భారీ స్థాయిలోనే బిజినెస్ జరుగుతోంది. రామ్ పాన్ ఇండియా హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ పారితోషికం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus