ఇటీవల వరుస అపజయాలు రావడంతో రామ్ పోతినేని తన కెరీర్‌పై మళ్లీ దృష్టిపెట్టాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో (iSmart Shankar) మాస్ ఇమేజ్‌ను పెంచుకున్న రామ్ (Ram) , అదే ఫార్ములాను ఫాలో అవుతూ ‘ది వారియర్’(The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) లాంటి సినిమాలు చేశాడు. అయితే, ఈ చిత్రాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్‌తో (Puri Jagannadh) మళ్లీ కలిసి చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ పెద్ద ఫ్లాప్ అవ్వడంతో, రామ్ కొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం రామ్, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి. మహేష్ (Mahesh Babu P) తో ఓ లవ్ డ్రామా చేస్తున్నాడు. గతంలో మాస్ యాక్షన్ సినిమాలకే ఎక్కువగా మొగ్గుచూపిన రామ్, ఈసారి రొమాంటిక్ కథతో తన ఫ్యాన్‌బేస్‌ను మరింత బలపర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రామ్ మరో డైరెక్టర్‌తో కూడా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది.
కొంతకాలంగా రామ్, ‘కార్తికేయ 2’ (Karthikeya 2) డైరెక్టర్ చందూ మొండేటితో (Chandoo Mondeti) కలిసి సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కథనాలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టత వచ్చింది. గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఫ్యాన్స్ మాత్రం రామ్ – చందూ మొండేటి కాంబో ఫై ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇది గాలి వార్తగానే మిగిలిపోయింది.
ఇదిలా ఉండగా, రామ్ మరో టాప్ డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) ఫేమ్ హరీష్ శంకర్‌తో (Harish Shankar) ఓ మాస్ ఎంటర్‌టైనర్ ప్లాన్‌లో ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. రామ్ ప్రస్తుతం సరైన కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారనుంది. త్వరలోనే రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.