ఆ హీరోయిన్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన రామ్..?

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన రెడ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై అబవ్ యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రెడ్ సినిమాలో మాళవిక శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నివేదా పేతురాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే రామ్ తరువాత సినిమాలో కూడా ఒక హీరోయిన్ పాత్రకు నివేదా పేతురాజ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ రామ్ పై పగ తీర్చుకునే పాత్రలో నటించనుంది. రెడ్ మూవీలో పాజిటివ్ రోల్ లో నటించిన నివేదా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా తరువాత నివేదా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

తెలుగులో చాలా సినిమాల్లోనే నటించినా నివేదాకు ఆ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టలేదు. గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాలో నివేదా కూడా నటించారు. ఆ సినిమాలోని పాత్ర నివేదా కెరీర్ కు ఏ మాత్రం ప్లస్ రాలేదు. రెడ్ మూవీలో నివేదా పాత్రకు మంచి పేరు వచ్చినా నివేదాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. నివేదాకు మరో సినిమాలో ఛాన్స్ ఇచ్చిన రామ్ ఈ సినిమాతోనైనా నివేదాకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus