Ram Pothineni , Boyapati: సినిమా స్టార్ట్ అయ్యి 8 నెలలు.. ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా..!

  • March 7, 2023 / 11:42 AM IST

బోయపాటి శ్రీను .. ప్రతిసారి ఓ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఇస్తున్నప్పటికీ.. ఎందుకో తన నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోని పట్టడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఈ 18 ఏళ్ళలో బోయపాటి శ్రీను తీసింది కేవలం 9 సినిమాలు. అందులో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలినవన్నీ విజయం సాధించినవే. పెద్ద డిజాస్టర్ అంటే అది ఒక్క ‘వినయ విధేయ రామ’ మాత్రమే. అయితే ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో కూడా రూ.60 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

బోయపాటి రేంజ్ అది. ‘అఖండ’ తర్వాత అల్లు అర్జున్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమా చేస్తాడు అనుకుంటే రామ్ వంటి మిడ్ రేంజ్ హీరోని పట్టుకున్నాడు. రామ్ తో పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టాడు. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 8 నెలలు కావస్తోంది. కానీ ఈ సినిమా గురించి చిత్ర బృందం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేసి టాపిక్ ను వైరల్ చేస్తున్నారు.

దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అంతేకాదు వారిలో కొత్త అనుమానాలు కూడా పుట్టుకొచ్చాయని చెప్పాలి. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు అని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. మే నెలలో రామ్ పుట్టినరోజు ఉంది. కాబట్టి కచ్చితంగా ఆ టైంకి ఓ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus