‘రఘవరన్ బి.టెక్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. తమిళనాడులో విడుదలై మంచి విజయం అందుకొని, 150 రోజులు దాటాక మన దగ్గర డబ్బింగ్ రూపంలో వచ్చింది. అయితే ఆ సినిమాను రామ్ హీరోగా రీమేక్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అది సాధ్యం కాకపోవడంతో డబ్బింగ్ సినిమా విడుదల చేశారని ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. తాజాగా మరో విషయం బయటికొచ్చింది. రామ్‌తో ‘రెడ్’ సినిమా తెరకెక్కిస్తున్న కిషోర్ తిరుమల ‘రఘువరన్ బి.టెక్’ కోసం పని చేశాడట.
రీమేక్‌లు మీకు కొత్త కదా అంటూ ఇటీవల కిషోర్ తిరుమలను అడిగితే అసలు విషయం బయటికొచ్చింది. ‘నాకు రీమేక్ తొలిసారి కావొచ్చు. అయితే గతంలో ఓ తమిళ సినిమాను తెలుగులోకి తీసుకువచ్చే టీమ్‌తో పని చేశా’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ‘రఘువరన్ బిటెక్’ సినిమా డబ్బింగ్ పనుల్లో కిషోర్ తిరుమల పని చేశాడట. కిషోర్ తిరుమల టీమ్ ‘రఘవరన్..’లో 40 శాతం డైలాగ్‌లు మార్చారట. అలాగే ఎడిటింగ్ విషయంలో కొన్ని మార్పులు చేశారట.
అలా ఈ సినిమా కోసం కిషోర్ తిరుమల రెండు నెలలు కష్టపడ్డాడట. అంటే ఒకవేళ ‘రఘువన్ …’ నేరుగా తెలుగులో వచ్చుంటే కిషోర్ తిరుమలనే దర్శకుడు అయ్యేవాడేమో. తొలి సినిమా అదే అయ్యేదేమో.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!