Rama Rajamouli: మిర్చి సినిమాకు రాజమౌళి భార్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా మిర్చి కూడా ఉంది అనే విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం రాజమౌళి భార్య రమ రాజమౌళి అని తెలుస్తుంది. ప్రభాస్ మిర్చి సినిమాకు ఈమెకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే ఈగ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ బాహుబలి సినిమా చేయటానికి కమిట్ అయ్యారట

అయితే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని తెలియడంతో రాజమౌళి అంగీకారంతోనే ప్రభాస్ రెబల్ సినిమాలో నటించి పూర్తి చేశారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ ప్రభాస్ కి మిర్చి సినిమా కథ వినిపించారట. ఈ కథ ప్రభాస్ కి విపరీతంగా నచ్చింది. ఎలాగైనా ఈ సినిమాలో నటించాలి కానీ రాజమౌళితో బాహుబలి సినిమాకు కమిట్ అవ్వడంతో ఆయన మిర్చి సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారో లేదో అని తెగ కంగారు పడ్డారట.

అయితే ఇదే విషయమే రాజమౌళి భార్య రమా (Rama Rajamouli) గారి వద్ద ప్రస్తావించగా వెళ్లి లక్షణంగా నువ్వు సినిమా చేసుకోపో మనోడు ఎలాగో సినిమా చాలా ఆలస్యంగా చేస్తారు కదా ఆ లోపు నీ సినిమా అయిపోతుంది అంటూ ఆమె చెప్పారట. ఇలా రమా రాజమౌళి ప్రభాస్ కి మంచి సపోర్ట్ చేయడంతోనే ఈయన మిర్చి సినిమాలో నటించారని, ఇలా ఆమె కారణంగానే ప్రభాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా వచ్చి చేరిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా త్వరగా పూర్తిచేసుకుని ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాతో బిజీ అయ్యారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఫాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus