Ramarao On Duty: రవితేజతో పాటు ‘రామారావు..’ సక్సెస్ ఆ ముగ్గురికీ కూడా చాలా అవసరం..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జూలై 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది.టీజర్, ట్రైలర్ బాగున్నాయి. అన్నీ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నుండి వచ్చిన ‘ఖిలాడి’ చిత్రం ప్లాప్ అయ్యింది.

దీంతో ‘రామారావు..’ తో కచ్చితంగా హిట్ కొట్టాలని రవితేజ కూడా భావిస్తున్నాడు. రవితేజకి మాత్రమే కాదు ఈ చిత్రం విజయం సాధించడం టాలీవుడ్ కు చాలా ముఖ్యం. అంతేకాకుండా మరో ముగ్గురికి కీలకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మంచి అభిరుచి కలిగిన, ప్యాషన్ కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి కి ఇంకా సరైన హిట్టు పడలేదు. అతని బ్యానర్ కు ఇప్పుడు కచ్చితంగా ఓ మంచి హిట్ అవసరం.

ఇక రెండో వ్యక్తి హీరోయిన్ దివ్యాంశ కౌశిక్. ‘మజిలీ’ తో మంచి హిట్టు కొట్టి.. తన లుక్స్ తో ఆకట్టుకున్నా ఈ అమ్మడు తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.ఈ సినిమాతో హిట్టుకొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని ఆశపడుతోంది.ఆమె కెరీర్ కు కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఇక మూడో వ్యక్తి అందరికీ తెలుసు.అతనే తొట్టెంపూడి వేణు. 9 ఏళ్ళ తర్వాత అతను రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘హనుమాన్ జంక్షన్’ ‘కళ్యాణ రాముడు’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వేణు ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వెంకటేష్ తో చేసిన ‘చింతకాయల రవి’, ఎన్టీఆర్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో చేసిన ‘దమ్ము’ చిత్రాలు అతనికి కలిసి రాలేదు. మరి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఈ చిత్రంలో వేణు సీఐ మురళి పాత్రలో కనిపించబోతున్నాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus