‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
జగపతి బాబు, ఖుష్బూ , గెటప్ శ్రీను, అలీ, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 4.80 cr |
సీడెడ్ | 2.00 cr |
ఉత్తరాంధ్ర | 2.20 cr |
ఈస్ట్ | 1.20 cr |
వెస్ట్ | 0.90 cr |
గుంటూరు | 1.10 cr |
కృష్ణా | 1.20 cr |
నెల్లూరు | 0.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
ఓవర్సీస్ | 0.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 15.10 cr (షేర్) |
‘రామబాణం’ (Ramabanam) చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలు ఒక్క రూ.12 కోట్ల షేర్ ను మించి కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు.
అయితే గోపీచంద్ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘లౌక్యం’ నిలిచింది. దానికి కూడా శ్రీవాస్ దర్శకుడు కాబట్టి.. ‘రామబాణం’ పై బయ్యర్స్ నమ్మకం పెట్టుకున్నారు. చూడాలి మరి వారి నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో..!
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?