నిన్న గుంటూరు కారం నుండీ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఓ మై బేబి అంటూ సాగే ఈ పాట బాగానే ఉంది. కానీ మహేష్ అభిమానులు, త్రివిక్రమ్ అభిమానులు ఇంకా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం వల్ల కావచ్చు కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించింది. దీనికి ఎక్కువ వ్యూస్ కూడా నమోదు కాకపోవడంతో ఈ పాట రచయిత రామజోగయ్య శాస్త్రి పై ట్రోలింగ్ మొదలైంది.
ఈ పాటలో ఇంగ్లీషు పదాలు కూడా ఎక్కువగా వాడారు, తెలుగుతనం మిస్ అయ్యింది… సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలా పాటని ప్రేమించి రాసే రచయితని.. త్రివిక్రమ్ అలాగే తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు అంటూ రామజోగయ్య శాస్త్రిని కొంతమంది తక్కువ చేసి మాట్లాడారు. ఇది రామజోగయ్య శాస్త్రికి కోపం తెప్పించింది.
అందుకే ఈ నెగిటివ్ కామెంట్స్ కి ఆయన ఘాటుగా స్పందించారు. తాజాగా రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో “ప్రతివాడు మాట్లాడేవాడే
రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది
పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే
లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి ” అంటూ రాసుకొచ్చాడు.
సరస్వతీ పుత్రగా పేరొందిన ఇతను గతంలో ఇలా అభిమానుల పై మండిపడ్డ సందర్భాలు ఎక్కువ లేవు. మొదటి పాట థమ్ మసాలా పాటకు కూడా లిరిక్స్ ఈయనే అందించారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!