Ramesh Babu: రమేష్ బాబుకు పిల్లలు ఎంతమంది అంటే?

ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యాభై ఆరేళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం రమేష్ బాబు కుటుంబ సభ్యుల గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక వ్యాపారాలతో రమేష్ బాబు గత కొంత కాలంగా బాగానే స్థిరపడి నట్లు తెలుస్తోంది. మొదట నిర్మాతగా ప్రయత్నాలు చేసిన రమేష్ బాబు ఆగడు సినిమాతో సక్సెస్ అందుకోవడంతో అటువైపు పెద్దగా అడుగులు వేయలేదు.

అయితే రమేష్ బాబుకు ఎంతమంది పిల్లలు? అనేది అలాగే ఆయన ఫ్యామిలీ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు రమేష్ బాబు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత మీడియా ముందుకు రావడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఆయన పర్సనల్ లైఫ్ తోనే చాలా బిజీగా ఉంటారని తెలుస్తోంది. అయితే మధ్యలో కొంత మద్యం అలవాటు కారణంగా కూడా ఆరోగ్యం చెడిపోవడంతో ఎవరిని కలిసేవారు కాదని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే సూపర్ స్టార్ కృష్ణ – ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్దబ్బాయి. మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని రమేష్ తరువాత వారే. ఇక ఆయన సతీమణి పేరు మృదుల. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. వీరు కూడా బాహ్య ప్రపంచంలో అంతగా కనిపించింది లేదు. ఇద్దరు చదువుకుంటున్నారు. చివరగా అబ్బాయి దొతి ఫంక్షన్ లో మాత్రమే రమేష్ బాబు కనిపించగా అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక కొడుకు జయకృష్ణ చిన్నవాడు కావడంతో ఇంకా కుటుంబ పరిస్థితులకు అలవాటు పడలేదు. వీరి బాధ్యతను మహేష్ బాబు తీసుకునే అవకాశం ఉంది. అయితే జయకృష్ణ ఇంతవరకు నటన పై మక్కువ చూపలేదు. మరి అతను హీరోగా అడుగులు వేస్తాడా లేక చదువు పూర్తయ్యాక బిజినెస్ తో సెటిల్ అవుతాడా అనేది కాలమే నిర్ణయించాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus